చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు | AP bifurcation: Protests continue in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు

Sep 2 2013 9:06 AM | Updated on May 25 2018 9:10 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. వరదయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది.

చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. వరదయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. నేటి నుంచి ఈనెల 9 వరకూ అన్ని పాఠశాలలు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. ఇక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎన్జీవోలు, ఉపాధ్యాయలు, అన్ని శాఖల జేఏసీలు మహాధర్నాకు దిగాయి. నెల రోజులుగా సీమాంద్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని, కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరముందని జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement