చంద్రబాబుపై అనంత ఫైర్ | Antha Venkatarami Reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై అనంత ఫైర్

Dec 12 2014 2:01 PM | Updated on Jul 11 2019 8:38 PM

చంద్రబాబుపై అనంత ఫైర్ - Sakshi

చంద్రబాబుపై అనంత ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు పార్లమెంట్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పంట బీమా నగదు పాత అప్పులకు జమ చేయకూడదని 2005లో పార్లమెంట్ చట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ చట్టానికి విరుద్ధంగా పంటల బీమా సొమ్మును రుణమాఫీ కింద జమ చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు నిర్వాకం వల్ల ఒక్క అనంతపురం జిల్లా రైతులే రూ. 226 కోట్ల బీమా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విధానాల వల్ల మేలు కంటే కీడే అధికంగా జరగుతుందని చెప్పారు. రైతులకు కొత్త రుణాలు రాలేదు.... అలాగే ఇన్పుట్ సబ్సిడీ అందలేదని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement