ప్రాజెక్టు పనుల్లో డొల్లతనాన్ని మసూద్ హుస్సేన్ కమిటీ బహిర్గతం చేస్తూ నివేదిక ఇవ్వడం..
తాజాగా కేంద్రం ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి 60సీ కింద నోటీసులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్‌ట్రాయ్ నుంచి వివరణ వచ్చాక.. అది సంతృప్తికరం గా లేకపోతే, అప్పుడు చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న వెంటనే.. వాటిని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా ట్రాన్స్‌ట్రా య్‌తో కలసి ప్రణాళిక రచించారని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. తద్వారా చర్యలు తీసుకున్నామని కేంద్రాన్ని మభ్యపెట్టాలన్నది ఎత్తుగడగా తెలుస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుది కావడంతో సీఎం చంద్రబాబు దాన్ని ముందునుంచీ వెనుకేసుకు వస్తున్న సంగతి విదితమే.