breaking news
Masood Hussain Committee
-
ఇదేమి అంచనా?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే.. అంచనా వ్యయంలో సవరించిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుందని మసూద్ హుస్సేన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తాజాగా తేల్చిచెప్పింది. 2015–16 ధరలతో పోలిస్తే.. 2013–14 ధరల ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం ఎక్కువగా చూపడాన్ని సీడబ్ల్యూసీ తప్పుపట్టింది. హెడ్‌వర్క్స్, భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ తదితర అంశాల వ్యయాన్ని ఒకేసారి రూ.30,924.03 కోట్లు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనల్లో తప్పులను సీడబ్ల్యూసీ ఇప్పటికే బహిర్గతం చేసింది. ఫిబ్రవరి 19న ఒకసారి, మార్చి 6వ తేదీన మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాతిపాదనలను తిప్పిపంపింది. తాము సంధించిన ప్రశ్నలకు ఆధారాలతో సహా సరైన వివరణ ఇస్తేనే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. రెండున్నరేళ్ల తర్వాత ప్రతిపాదనలు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల విషయంలో సీడబ్ల్యూసీ ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. ఈ నెల 17, 18 తేదీల్లో పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన మసూద్ హుస్సేన్ కమిటీ ఈ నెల 21వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తేనే సవరించిన వ్యయ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆ నివేదికలో మరోసారి స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. కాగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తొలి సమావేశం 2015 మార్చి 12న జరిగింది. తాజా ధరల మేరకు ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, రెండున్నరేళ్ల తర్వాత అంటే 2017 ఆగస్టు 16న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలు.. - పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయం (హెడ్ వర్క్స్) అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.5,535.41 కోట్లకు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, 2013–14 ధరల ఆధారంగా రూపొందించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో రూ.11,637.98 కోట్లుగా పేర్కొన్నారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలతో రూపొందించిన అంచనా వ్యయం తక్కువగా ఉండాలి. కానీ, అధికంగా ఉండటానికి కారణాలు ఏమిటి? - కుడి కాలువ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం రూ.4,375.77 కోట్లుగా నిర్ధారిస్తూ 2016 డిసెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ప్రకారం రూపొందించిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో కుడి కాలువ వ్యయాన్ని రూ.3,645.15 కోట్లుగా పేర్కొంది. అలాగే ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.3,645.15 కోట్లుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ఆధారంగా దాని వ్యయం తగ్గాలి. కానీ, రూ.4,960.83 కోట్లకు వ్యయం ఎలా పెరిగింది? - పోలవరం జలాశయం, కుడి, ఎడమ కాలువలకు భూసేకరణ చట్టం–2013 అమల్లోకి రాక ముందు ఎంత భూమి సేకరించారు? ఆ తర్వాత ఎంత సేకరించారు? ఇందులో అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, గిరిజనుల భూముల విస్తీర్ణం ఎంత? - 2010–11 ధరల ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్లే. కానీ, 2013–14 ధరల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.33,858.45 కోట్లకు పెంచేశారు. వ్యయం ఒకేసారి రూ.30,924.03 కోట్లు ఎందుకు పెరిగింది? స్పందించని ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంచనా వ్యయం పెంపు, టెండర్లు తదితర అంశాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు పీపీఏ అనుమతి లేదు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ తప్పుబట్టడం, ఈ వ్యవహారంలో అక్రమాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర సర్కార్ ఆందోళన చెందుతోంది. భూసేకరణలో చోటుచేసుకున్న అవకతవకలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని భయపడుతోంది. అందుకే సీడబ్ల్యూసీ సంధించిన ప్రశ్నలపై స్పందించడం లేదని తెలుస్తోంది. -
పోలవరం ప్రాజెక్టు పరిధి పెంచారా?
-
పోలవరం ప్రాజెక్టు పరిధి పెంచారా?
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం విషయంలో దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం పర్యావరణ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధి పెంచారా? అని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. దీనికి బదులుగా 36 లక్షల క్యూసెక్కుల వరద నుంచి 50 క్యూసెక్కులకు మార్పు చేశామన్న సమాధానం వినిపించింది. ఆపై అదనంగా ముంపు ఎంత పెరిగిందని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని న్యాయవాది బదులిచ్చారు. కాగా, ఈ వాదనతో పిటిషనర్ విభేదించారు. ముంపుతో విపత్తు ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొనటంతో.. సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా ఉన్న పిటిషన్ల కాపీలన్నీ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 2019 కల్లా పోలవరం అసాధ్యం పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వమంతా గోల్ మాల్ వ్యవహారం నడుపుతోందని మసుద్ హుస్సేన్ కమిటీ ఇచ్చిన నివేదికతో స్పష్టమౌతోంది. 2019 కల్లా ప్రాజెక్టు పూర్తవటం అసాధ్యమని కమిటీ చెప్పటంతో చంద్రబాబు ప్రభుత్వం చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయిందన్నది వెల్లడైంది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 50 వేల కోట్లకు పెంచటం విస్మయం కలిగిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకుండా ఆయకట్లు పనులు ఎలా చేపడతారోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. పునరావాసం పరివాసం కూడా రూ. 2,394 కోట్ల నుంచి 32 వేల కోట్లకు అంచనాల పెంపుపై కమిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపిక చేసిన పునులే చూపిస్తూ.. కుడి, ఎడమ కాలువల్లో ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు పూర్తి కాలేదని కమిటీ నివేదిక వెల్లడించింది. జల విద్యుత్ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. కాపర్ డ్యామ్ ద్వారా 2018 కల్లా గ్రావిటీ నీళ్లు మళ్లీస్తామని చంద్రబాబు ప్రకటించారని.. కానీ, డ్యామ్ కోసం ఇంకా భూసేకరణే పూర్తి చేపట్టలేదని.. అలాంటప్పుడు చంద్రబాబు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నది స్పష్టమౌతోంది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రాజెక్టు నిర్వాణంలో భారీ అవినీతి జరగుతుందోంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మసుద్ కమిటీ డొల్లతనం మొత్తం బయటపెట్టగా.. బల్రాజ్ జోషి కమిటీ నేడో, రేపో పోలవరం పనులను పరిశీలించనుంది. -
నోటీసుల పేరుతో మరో నాటకం
సాక్షి, అమరావతి: ప్రాజెక్టు పనుల్లో డొల్లతనాన్ని మసూద్ హుస్సేన్ కమిటీ బహిర్గతం చేస్తూ నివేదిక ఇవ్వడం.. కేంద్రం చర్యలకు ఉపక్రమించడంతో.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొత్త నాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్పై వేటు వేయాలని తొలి నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ప్రతిపాదిస్తూ వస్తున్నా పట్టించుకోకపోగా.. ఆ సంస్థకు వంతపాడుతూ వచ్చిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు చర్యలకు ఉపక్రమించినట్లు నటిస్తోంది. ట్రాన్స్ట్రాయ్కు 60సీ కింద నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా కొన్ని పనులు తొలగించి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలని భావిస్తోంది. తాజాగా కేంద్రం ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి 60సీ కింద నోటీసులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్ట్రాయ్ నుంచి వివరణ వచ్చాక.. అది సంతృప్తికరం గా లేకపోతే, అప్పుడు చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న వెంటనే.. వాటిని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా ట్రాన్స్‌ట్రా య్‌తో కలసి ప్రణాళిక రచించారని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. తద్వారా చర్యలు తీసుకున్నామని కేంద్రాన్ని మభ్యపెట్టాలన్నది ఎత్తుగడగా తెలుస్తోంది. ట్రాన్స్ట్రాయ్ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుది కావడంతో సీఎం చంద్రబాబు దాన్ని ముందునుంచీ వెనుకేసుకు వస్తున్న సంగతి విదితమే.