బంగాళాఖాతంలో మరో అల్పపీడనం | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Published Sun, Aug 3 2014 1:27 AM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - Sakshi

నేటి నుంచి ఉత్తర తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ సీతారామ్ ‘సాక్షి’కి తెలిపారు. ఐదు రోజులపాటు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని వివరించారు.

ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement