'బాబు వచ్చాడు... ఉన్న జాబులు పోయాయి' | Andhra pradesh unemployees strike at indhirapark | Sakshi
Sakshi News home page

'బాబు వచ్చాడు... ఉన్న జాబులు పోయాయి'

Mar 11 2015 12:26 PM | Updated on Aug 18 2018 4:18 PM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టింది. బుధవారం నిరుద్యోగులు చేస్తున్న సంకల్ప దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సంఘీభావం తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతూనే ఉంటుందని చెవిరెడ్డి అన్నారు.

బాబు వచ్చాడు... ఉన్న జాబులు పోయాయని ఎమ్మెల్యే రాంరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు గోవిందరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మార్చి 29న విజయవాడలో నిరుద్యోగ గర్జన చేపడతామని గోవిందరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement