CoronaVirus Outbreak: SPS Nellore District is the Fastest Spread Covid-19 | నెల్లూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు - Sakshi
Sakshi News home page

నెల్లూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు

Apr 3 2020 10:51 AM | Updated on Apr 3 2020 5:29 PM

Andhra Pradesh Health Bulletin Released By Jawahar Reddy Amid Corona VIrus - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. అత్యధికంగా నెల్లూరులో 32 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇక జిల్లాల వారిగా కృష్ణా 23, గుంటూరు 20, వైఎస్సార్‌ కడప 19, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 14, చిత్తూరు, తూర్పు గోదావరిలో 9 పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదయిన పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలు వెళ్లి వచ్చిన వారేకావడం గమనార్హం.

  • తబ్లీగ్‌ జమాతేకు ఏపీ నుంచి వెళ్లినవారు 1085
  • వీరిలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు వాళ్లు 946
  • ఇందులో 881 మందికి పరీక్షలు పూర్తి
  • వీరిలో 108 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌
  • జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు వారితో, కాంటాక్ట్‌ అయినవారు 613 మందికి పరీక్షలు
  • వీరిలో 32 మంది పాజిటివ్‌
  • మొత్తం 161 పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో కాంటాక్ట్‌ అయినవారే

Advertisement
 
Advertisement
Advertisement