AP EAMCET 2019 Results | Andhra Pradesh EAMCET Results Released | ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల - Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

Jun 4 2019 11:44 AM | Updated on Jun 4 2019 1:04 PM

Andhra Pradesh EAMCET Results Release - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో స్టేట్‌ ర్యాంకు, వేద ప్రణవ్‌ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్‌లో సుంకర సాయి స్వాతి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. ఆయా ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపనున్నట్లు విజయరాజు తెలిపారు. కాగా ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు.
( ఏపీ ఎంసెట్‌ ఫలితాల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి )
 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంజనీరింగ్‌ టాప్‌టెన్‌ ర్యాంకర్లు
1. కరిశెటి రవి శ్రీతేజ
2.వేద ప్రణవ్‌
3.గొర్తి భాను దత్తు
4. హేథవావ్య
5. బట్టెపాటి కార్తికేయ
6.రిషి షర్రష్
7.సూర్య లిఖిత్‌
8. అప్పలకొండ అభిజిత్‌ రెడ్డి
9. ఆర్యన్‌ లద్దా
10.హేమ వెంటక అభినవ్‌

అగ్రికల్చర్‌, మెడికల్‌ టాప్‌టెన్‌ ర్యాంకర్లు

1.సుంకర సాయి స్వాతి
2. దాసరి కిరణ్‌కుమార్‌ రెడ్డి
3. అత్యం సాయి ప్రవీణ్‌ గుప్తా
4. తిప్పరాజు రెడ్డి
5.జీ మాధురి రెడ్డి
6. గొంగటి కృష్ణ వంశీ
7. కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ
8. భీ. సుభిక్ష
9. కొర్నెపాటి హరిప్రసాద్‌
10. ఎంపటి కుశ్వంత్‌

Advertisement
 
Advertisement
Advertisement