తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల | Telangana Pgecet 2025 Results Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

Jun 26 2025 5:10 PM | Updated on Jun 26 2025 6:17 PM

Telangana Pgecet 2025 Results Released

సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో పీజీఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ బాలకిష్ట రెడ్డి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ అరుణ కుమారి విడుదల చేశారు. 25, 335 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 22,983 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 16 నుంచి 19 వరకు పరీక్షలు జరిగాయి. ఉత్తీర్ణత శాతం 90.72 శాతంగా నమోదైంది.

ఆర్కిటెక్చర్ ప్లానింగ్ విభాగంలో తురియా దీక్షిత్, ఏరోస్పెస్ ఇంజినీరింగ్‌లో శివ చరణ్, బయో మెడికల్ ఇంజినీరింగ్‌లో హరిణి, బయో టెక్నాలజీలో తనుజా, సివిల్ ఇంజినీరింగ్‌లో వెంకటేష్, కెమికల్ ఇంజినీరింగ్‌లో అశుతోష్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షభిస్తా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో శివ ప్రసాద్ మొదటి ర్యాంక్‌లు సాధించారు.

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మహేష్, ఇన్స్ట్రునెంటేషన్ ఇంజినీరింగ్‌లో చంద్రసేన్, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉజ్వల, ఫుడ్ టెక్నాలజీలో నిఖిల్ కుమార్, జియో ఇంజినీరింగ్ జియో ఇన్ఫార్మటిక్స్‌లో డిలైట్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో సతీష్, మైనింగ్ ఇంజినీరింగ్ లో అనిల్, మెటాలర్జికల్ ఇంజినీరింగ్‌లో శ్రీ హర్షిణి, నానో టెక్నాలజీలో సాయి కృష్ణ, ఫార్మసీలో షేక్ అర్షియా కౌనేను, టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీలో వర్ష మొదటి ర్యాంక్‌లు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement