
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ నియామక మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పోలీసు కానిస్టేబుల్ –సివిల్ (పురుషులు, మహిళలు), పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ–పురుషులు) మెయిన్ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరవ్వగా, 33,921 మంది అర్హత సాధించారు. వీరిలో పురుషులు 29,211 మంది, మహిళలు 4,710 మంది ఉన్నారు. ఈ మేరకు గురువారం పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.
ఫలితాలను www.slprb.ap.gov.in వెబ్‌సైట్‌లోఉంచినట్టు వివరించారు. తుది కీలో అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యర్థనలను పరిశీలించి దిద్దుబాటు చేసినట్టు ప్రకటించారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. 12వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రూ.వెయ్యి రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.