'చెన్నంపల్లి' తవ్వకాల్లో కీలక పరిణామం | ancient-idols-excavated-in chennampally-excavations | Sakshi
Sakshi News home page

'చెన్నంపల్లి' తవ్వకాల్లో కీలక పరిణామం

Feb 16 2018 2:44 PM | Updated on Feb 16 2018 3:44 PM

ancient-idols-excavated-in chennampally-excavations - Sakshi

చెన్నంపల్లి కోటలో తవ్వకాలు (ఫైల్‌ ఫొటో)

కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో జరుగుతున్న తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో జరుగుతున్న తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. అనంతంర ఈ నెల 3 వతేదీన మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు జరిపిన తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాలు జరుపుతున్న కూలీలు ఇచ్చిన సమారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు దొరికిన విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడిగా ధ్రువీకరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement