రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు
'అనంతను కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
Sep 30 2014 7:50 PM | Updated on Jun 1 2018 8:52 PM
హైదరాబాద్: రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏర్పడిన కరువు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విదర్భ, బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కాల్వ అన్నారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడం వలన జిల్లా ప్రజలు సమస్యల నుంచి గట్టేక్కుతారని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
Advertisement
Advertisement