విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి | Anantapur: Class 9th Girl Student Sexually Harassed by Teacher | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

Jul 4 2014 1:24 PM | Updated on Jul 23 2018 8:49 PM

విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి - Sakshi

విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారి 9వ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారి 9వ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దాంతో సదరు విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో స్కూల్కు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.

 

అనంతరం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని స్కూల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన శుక్రవారం అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కేంద్రంలోని వివేకానంద జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement