టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి డిమాండ్ చేశారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు ఏం చేయాలో కూడా చెప్పాలన్నారు. ప్రధానమంత్రి హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వారు శనివారమిక్కడ పేర్కొన్నారు.
టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ఆమోస్, యాదవరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యేలను కొనే అవసరం ఎవరికుందని సూటిగా ప్రశ్నించారు.