సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా? | Ambati Rambabu questions Chandrababu Naidu over localbody elections | Sakshi
Sakshi News home page

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?

Jul 1 2014 6:52 PM | Updated on Jul 28 2018 2:46 PM

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా? - Sakshi

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?

ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక కూడా దిగజారుడు రాజకీయం సమంజసమేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక కూడా దిగజారుడు రాజకీయం సమంజసమేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  చంద్రబాబూ.. నీకు ఎందుకంత అధికారదాహం అని నిలదీశారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే దురుద్దేశంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బలవంతంగా ఎత్తుకెళ్లారని అంబటి మీడియాకు తెలిపారు. 
 
ఎంపీటీసీలను ఎత్తుకుపోయిన విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీచేసే అధికారం ఉందని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసిన విషయాన్ని అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement