మరో విడత  రైతు భరోసా చెల్లింపులు: అరుణ కుమార్‌ | Agriculture Commissioner Arun Kumar Talk About YSR Rythu Bharosa | Sakshi
Sakshi News home page

మరో విడత  రైతు భరోసా చెల్లింపులు: అరుణ కుమార్‌

Oct 30 2019 3:58 PM | Updated on Oct 30 2019 3:58 PM

Agriculture Commissioner Arun Kumar Talk About YSR Rythu Bharosa - Sakshi

వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ కుమర్‌

సాక్షి, అమరావతి: ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ కుమర్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్‌  15 వర​కు రైతు భరోసా పధకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. వచ్చే రెండు బుధవారాల్లో లబ్ధిదారులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అరుణ కుమార్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement