బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే | After humiliating pilgrimage | Sakshi
Sakshi News home page

బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే

Mar 23 2014 2:32 AM | Updated on Mar 29 2019 9:18 PM

బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే - Sakshi

బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే

‘సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోరుుంది. మిగిలిన కొద్దిపాటి నాయకులూ ఏం చేయాలో తెలియక బస్సు యాత్రలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌పై ఏలూరు సభలో వెంకయ్య ధ్వజం
 పవన్ కల్యాణ్ రాక
 లోక కల్యాణం కోసమేనని వ్యాఖ్య

 
 
 ‘సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోరుుంది. మిగిలిన కొద్దిపాటి నాయకులూ ఏం చేయాలో తెలియక బస్సు యాత్రలు చేస్తున్నారు. బస్సు యూత్రలయ్యూక కాంగ్రెస్ పార్టీకి తీర్థయూత్రలు ఖాయం’ అని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ‘మోడీ ఫర్ పీఎం’ ప్రజా ఉద్యమంలో భాగంగా శనివారం సాయంత్రం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.


పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ లోక కల్యాణం కోసం వస్తున్నాడని.. వద్దనే ప్రసక్తే లేదన్నారు.  రెండు మూడు రోజుల్లో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానున్నాయన్నారు. అరవయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనమైందని.. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దేశానికి ఆశాకిరణంలా మోడీ ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. పోలవరాన్ని ఆపడం, నీళ్లు రాకుండా  చేయడం ఎవరితరం కాదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.



కేంద్ర మంత్రి జైరాం రమేష్ అతి తెలివితో ఇటు సీమాంధ్రలోనూ, అటు తెలంగాణలోనూ రకరకాలుగా మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలుపెంచుతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశాన్ని పాలించలేవంటూ.. జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘తెలంగాణ, సీమాంధ్రలను మళ్లీ కలుపుతాడట.. ఇదేమన్నా పాతాళభైరవి సినిమానా?’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకివే ఆఖరి ఎన్నికలని వెంక య్యనాయుడు స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement