పర్మిట్ లేదు... అనుభవం లేదు | Accident driver experience 6 months only, says RTA officials | Sakshi
Sakshi News home page

పర్మిట్ లేదు... అనుభవం లేదు

Feb 3 2015 10:42 AM | Updated on Apr 3 2019 7:53 PM

పర్మిట్ లేదు...  అనుభవం లేదు - Sakshi

పర్మిట్ లేదు... అనుభవం లేదు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో బీభత్సం సృష్టించిన స్కూల్ బస్సుకు పర్మిట్ లేదని ఆర్టీఏ అధికారులు మంగళవారం రాజమండ్రిలో స్పష్టం చేశారు.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో బీభత్సం సృష్టించిన స్కూల్ బస్సుకు పర్మిట్ లేదని ఆర్టీఏ అధికారులు మంగళవారం రాజమండ్రిలో స్పష్టం చేశారు. ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు ఆరు నెలలే అనుభవం ఉందని తెలిపారు. దీంతో డ్రైవర్కు స్కూల్ బస్సు నడిపేందుకు అర్హత లేదన్నారు.

రాజమండ్రి మోరంపూడి జంక్షన్లోని 16వ నంబరు జాతీయ రహదారిపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. వేమగిరి వైపు వెళ్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement