రవాణాశాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి | ACB raids transport office | Sakshi
Sakshi News home page

రవాణాశాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి

Feb 11 2016 3:11 PM | Updated on Aug 17 2018 12:56 PM

విజయవాడ నగరంలోని రవాణాశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక విభాగం అధికారులు గురువారం ఉదయం సోదాలు జరిపారు.

విజయవాడ : విజయవాడ నగరంలోని రవాణాశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక విభాగం అధికారులు గురువారం ఉదయం సోదాలు జరిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఎంవీఎస్‌ఎస్ నాయుడు సహా ఏడుగురు బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు.

కార్యాలయం సమీపంలోనే ఉన్న బ్రోకర్ల అడ్డాపైనా దాడి చేసి, రూ.2.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు సందర్బంగా బ్రోకర్ల ద్వారా కార్యాలయ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు అందటంతో దాడులు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement