సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు | ACB raids registrar office | Sakshi
Sakshi News home page

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Jun 6 2016 6:42 PM | Updated on Aug 17 2018 12:56 PM

జంగారెడ్డి గూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) :  జంగారెడ్డి గూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు రూములో అనధికారికంగా ఉన్న రూ.14వేలు, బి.శ్రీనివాస్ అనే దస్తావేజు లేఖరి వద్ద రూ.1.03 లక్షలు, మరో ఏడుగురు దస్తావేజు లేఖరుల వద్దనున్న రూ.62వేలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని సోదాలకు నేతృత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement