చెక్పోస్ట్పై ఏసీబీ దాడి: రూ.36 వేలు స్వాధీనం | acb raids in gamalapadu checkpost | Sakshi
Sakshi News home page

చెక్పోస్ట్పై ఏసీబీ దాడి: రూ.36 వేలు స్వాధీనం

Mar 15 2016 11:16 AM | Updated on Aug 17 2018 12:56 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు చెక్పోస్ట్పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు.

గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు చెక్పోస్ట్పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ. 36 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెక్పోస్ట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రహదారిపై వెళ్తున్న వాహనాల నుంచి సదరు చెక్పోస్ట్ సిబ్బంది భారీగా నగదు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement