ఏసీబీకి చిక్కిన హౌసింగ్ ఏఈ | ACB Caught Housing AE in Krishna District | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన హౌసింగ్ ఏఈ

Jun 11 2015 6:39 PM | Updated on Aug 17 2018 12:56 PM

కృష్ణా జిల్లా కోడూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ.. లబ్దిదారుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు చిక్కాడు.

కోడూరు (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా కోడూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ.. లబ్దిదారుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. వివరాల ప్రకారం... పాదాలవారిపాలెం గ్రామానికి చెందిన  చిముటూరి శ్యాంసన్‌కు పక్కా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆఖరి విడత బిల్లు రూ.17,500 మేర రావాల్సి ఉంది. ఇందుకోసం స్థానిక హౌసింగ్ ఏఈ పి.గణేశ్వరరావు వద్దకు వెళ్లగా ఆయన రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో శ్యాంసన్ ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారిచ్చిన సూచనల మేరకు గురువారం సాయంత్రం శ్యాంసన్‌ హౌసింగ్ ఏఈ గణేశ్వరరావుకి రూ.10వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement