ఏసీబీ దాడి | ACB Attack | Sakshi
Sakshi News home page

ఏసీబీ దాడి

Jan 19 2014 4:33 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం పొందూర్తి గ్రామశివారులో జాతీయరహదారి పక్కన ఉన్న ఆర్టీఏ చెక్ పాయింట్‌పై శనివారం వేకువ జామున ఏసీబీ అధికారులు దాడి చేశారు.

భిక్కనూరు, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం పొందూర్తి గ్రామశివారులో జాతీయరహదారి పక్కన ఉన్న ఆర్టీఏ చెక్ పాయింట్‌పై శనివారం వేకువ జామున ఏసీబీ అధికారులు దాడి చేశారు. వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులైన హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మల్లికార్జున్, నర్సన్నపల్లికి చెందిన చందాని శ్రీధర్, నందవెంకట్రాజం, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన బెజ్జం చందులతో పాటు విధులు నిర్వహిస్తున్న ఏఎంవీఐ సురేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు.
 
 నిందితుల నుంచి రూ. 58 వేల 320 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు ఆధ్వర్యంలో ఈ దాడి  జరిగింది.పొందూర్తి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు 8 నెలల కాలంలో రెండుసార్లు దాడులు నిర్వహించారు. గతేడాది జూన్‌లో దాడులు నిర్వహించి అప్పటి ఏఎంవీఐ అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement