తొమ్మిదిమందిని కరిచేశాయి | 9 persons injure due to dogs bite | Sakshi
Sakshi News home page

తొమ్మిదిమందిని కరిచేశాయి

Jun 19 2015 8:17 AM | Updated on Sep 29 2018 4:26 PM

తొమ్మిదిమందిని కరిచేశాయి - Sakshi

తొమ్మిదిమందిని కరిచేశాయి

మరోసారి కుక్కలు స్వైర విహారం చేశాయి. స్థానికులను హడలెత్తించాయి. చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో కుక్కలు ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోయాయి.

కృష్ణా: మరోసారి కుక్కలు స్వైర విహారం చేశాయి. స్థానికులను హడలెత్తించాయి. చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో కుక్కలు ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోయాయి. కనిపించివారందరిపై దాడి చేశాయి. మొత్తం తొమ్మిదిమంది వీటివల్ల గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, గ్రామ నిర్వహణ కార్యకలాపాల్లో నిర్లక్ష్యం మూలంగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే వాటి బారినుంచి బయటపడే రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement