హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం | 9 additional judges sworn in at Andhra pradesh High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం

Oct 23 2013 12:00 PM | Updated on Aug 31 2018 8:24 PM

రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది బుధవారం ప్రమాణం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది బుధవారం  ప్రమాణం చేశారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించారు. జిల్లా జడ్జీలుగా ఉన్న 9 మందిని పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాదరావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్ అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement