వోల్వో బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు | 7 injured in road accident at west godavari | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు

Apr 30 2016 8:55 AM | Updated on Sep 3 2017 11:07 PM

లారీ, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సహా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

జంగారెడ్డిగూడెం: లారీ, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సహా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని ఆరుగురు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement