ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం | 6-year-old girl allegedly raped by youth | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

Jun 20 2018 7:38 AM | Updated on Nov 6 2018 4:57 PM

6-year-old girl allegedly raped by youth - Sakshi

తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా పెద్దేవం గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాళ్లపూడి ఎస్సై కె.అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేవం గ్రామానికి చెందిన 3వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం మధ్యాహ్నం ఎం.ఉదయ్‌కిరణ్‌ (20) అత్యాచారం చేశాడు. యువకుడిది బుట్టాయగూడెం కాగా అమ్మమ్మ గారింట్లో పెద్దేవం వచ్చి ఉంటున్నాడు. బాలిక ఇంటి సమీపంలోనే ఉదయ్‌కిరణ్‌ ఉంటున్నాడు. బాలిక తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉండడం చూసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement