ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్ | 5 tamil workers arrested | Sakshi
Sakshi News home page

ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్

Dec 25 2015 7:55 PM | Updated on Sep 3 2017 2:34 PM

వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా ఐదుగురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రైల్వేకోడూరు (వైఎస్సార్‌జిల్లా): జిల్లాలో అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా ఐదుగురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

 

వీరిలో ఐదుగురు తమిళనాడుకు చెందిన కూలీలు కాగా... మరొకతను ఒంటిమిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 628 కిలోల బురువున్న 24 ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ రసూల్ సాహెబ్ తెలిపారు.ఈ దుంగలు విలువ రూ.15 లక్షలు వరకూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement