కారు బోల్తా: ఐదుగురికి గాయాలు | 5 injured in a car slipped incident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

Aug 11 2015 4:51 PM | Updated on Sep 3 2017 7:14 AM

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వి.కోట(చిత్తూరు జిల్లా): వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఓగు గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన కొంత మంది కారులో చిత్తూరు వెళ్తున్నారు. కాగా, మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వెలూరులో ఉన్న సీఎమ్‌సీ మెడికల్ కాలేజీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement