కారు బోల్తా-ఒకరి మృతి | A car slipped and one person died | Sakshi
Sakshi News home page

కారు బోల్తా-ఒకరి మృతి

May 12 2015 7:09 AM | Updated on Sep 3 2017 1:54 AM

కారు బోల్తా-ఒకరి మృతి

కారు బోల్తా-ఒకరి మృతి

జాతీయ రహదారి-16 పై వేగంగా వెళ్తున్న కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

తొండంగి (తూర్పుగోదావరి): జాతీయ రహదారి-16 పై వేగంగా వెళ్తున్న కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో జరిగింది. వివరాలు.. వైజాగ్ నుంచి ఏలూరు వెళ్తున్న కారు అన్నవరం సమీపంలో టైరు పంచర్ కావడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో రిటైర్డు ఉద్యోగి ఎల్. చందర్‌రావు(65) మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement