శంషాబాద్ లో కారు బీభత్సం | 3 injured in a car slipped accident | Sakshi
Sakshi News home page

శంషాబాద్ లో కారు బీభత్సం

Apr 10 2016 12:51 AM | Updated on Mar 28 2018 11:26 AM

శంషాబాద్ సమీపంలో శనివారం రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది.

మూడు బైక్‌లను ఢీకొట్టిన కారు
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో శనివారం రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు ముందు వెళ్తున్న మూడు బైక్‌లను ఢీకొట్టి, ఆపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక బైక్‌పై ఉన్న దంపతులతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మిగతా వాహనదారులకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పరారయ్యాడు. కారును పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement