ఔటర్‌పై కారు బోల్తా.. ఒకరి మృతి | one died at outer ring road in car slipped incident | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై కారు బోల్తా.. ఒకరి మృతి

Feb 3 2016 9:36 AM | Updated on Mar 28 2018 11:26 AM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

శంషాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాళ్లగూడ ఔటర్‌రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కారులో గచ్చిబౌలికి వెళ్తుండగా, అతివేగంగా కారు నడపటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement