4 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత | 4 sand tractors seized in nellore distirict | Sakshi
Sakshi News home page

4 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Aug 10 2015 8:45 AM | Updated on Oct 20 2018 6:04 PM

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లతో పాటు ఓ జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4  ట్రాక్టర్లతో పాటు ఓ జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవురు మండలం జమ్మిపాలెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్సై సుధాకర్‌రెడ్డి తనిఖీలు చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సరికి ఇసుకను తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. ఇసుక తరలింపునకు ఉపయోగిస్తున్న 4 ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement