నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్ | 4 redsander smaggulers arrested in chittoor distirict | Sakshi
Sakshi News home page

నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్

Aug 28 2015 12:30 PM | Updated on Sep 3 2017 8:18 AM

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం కూలీలను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రేణుగుంట: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం కూలీలను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని రేణుగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన సుమారు 40 మంది ఎర్రచందనం కూలీలు కంటెయినర్ లారీలో వెళ్తున్నారు.

కాగా, రేణిగుంట చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారని గమనించి వెంటనే లారీ లోంచి దూకి పారిపోయారు. కాగా, విషయం తెలిసిన పోలీసులు వారిని వెంబడించి నలుగురు కూలీలను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement