37 కేజీల గంజాయి పట్టివేత | 37 kg of opium caught by police | Sakshi
Sakshi News home page

37 కేజీల గంజాయి పట్టివేత

Feb 24 2015 2:46 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఈస్ట్‌కోస్ట్ రైలులో ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

పలాస: ఈస్ట్‌కోస్ట్ రైలులో ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కృష్ణ(18), పల్లు నాయక్(24) ఒడిశాలోని బరంపురం నుంచి 37 కేజీల గంజాయిని గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల గంజాయి రవాణా పెరిగిపోవడంతో నిఘా పెట్టినట్టు రైల్వే రక్షక దళం ఎస్‌ఐ మునప్ మంగళవారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement