సుమలతకు మరో రూ. 31 వేల వితరణ | 31 thousand donation Financial support Sumalatha | Sakshi
Sakshi News home page

సుమలతకు మరో రూ. 31 వేల వితరణ

Jan 9 2015 2:35 AM | Updated on Sep 2 2017 7:24 PM

సుమలతకు మరో రూ. 31 వేల వితరణ

సుమలతకు మరో రూ. 31 వేల వితరణ

బురిడికంచరాం గ్రామానికి చెందిన వండాన సుమలతకు గురువారం మరికొంతమంది దాతలు రూ. 31వేల ఆర్థిక సాయం

పొందూరు: బురిడికంచరాం గ్రామానికి చెందిన వండాన సుమలతకు గురువారం మరికొంతమంది దాతలు రూ. 31వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో ఉన్న సాయి విద్యామందిర్ టెక్నోస్కూల్ సిబ్బంది రూ. 27వేలను, వాల్తేరు జిల్లా పరిషత్ హైస్కూల్ సిబ్బంది రూ. 4వేలు ఇచ్చారు.  సుమలత బోన్‌మారో లోపంతో బాధపడుతున్న వైనంపై గత ఏడాది డిసెంబర్ 5న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి వారు స్పందించి నగదును అందించారు. సిస్టం డిగ్రీ కళాశాల విద్యార్థులు సురేష్, జగన్నాథనాయుడు కృషితో నిధులు సేకరించామని సాయివిద్యామందిర్ సిబ్బంది తెలిపారు. కాగా, వండాన సుమలత కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకొంది. సుమలత తల్లి తవిటమ్మ కడుపులో కణితి ఉండటంతో ప్రస్తుతం శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement