మహానాడుకు 30 వేల మందికి ఆహ్వానాలు | 30 thousand invitations for tdp mahanadu | Sakshi
Sakshi News home page

మహానాడుకు 30 వేల మందికి ఆహ్వానాలు

May 12 2016 7:12 PM | Updated on Oct 8 2018 5:28 PM

ఈ నెల 27వ తేదీ నుంచి తిరుపతిలో జరగబోయే మహానాడుకు ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు..

తిరుపతి: ఈ నెల 27వ తేదీ నుంచి తిరుపతిలో జరగబోయే మహానాడుకు ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ సెంటర్‌లోని హోటల్ ఇంటర్నేషనల్‌లో జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

రాష్ట్ర కమిటీ ప్రతినిధులు.. అతిథులకు గదులు, భోజనాల కల్పన, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. టీటీడీ గదులు, కల్యాణ మండపాలు, అతిథి గృహాలను 20వ తేదీలోగా రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. అంతకుముందు నాయకులు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకుని వేదిక నిర్మాణానికి అనువైన చోటును ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్, మంచినీరు, టాయిలెట్స్, భోజన వసతుల కల్పనపై కళా వెంకట్రావు జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మంత్రి నారాయణలతో మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement