30 లోగా పుష్కర పనులు పూర్తి


దానవాయిపేట (రాజమండ్రి) : రాజమండ్రిలో చేపట్టిన పుష్కర పనులను ఈ నెల 30కి పూర్తి చే రుుస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ర్ట ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ మురళీమోహన్‌తో కలిసి సమాచార, పౌరసంబంధాలు, సాంస్కృతిక శాఖల కార్యకలాపాలపై సమీక్షించారు. అంతకుముందు నగరంలో పుష్కర పనులను పరిశీలించారు. మోరంపూడి, లాలాచెరువు, సెంట్రల్ జైలు వద్ద నిర్మిస్తున్న అమ్యూజ్‌మెంట్ పార్కులను పరిశీలించి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథి గృహనికి చేరుకుని సమీక్షించారు.

 

  సమాచార శాఖ కమీషనర్ ఎం.వి.రమణరెడ్డి మాట్లాడుతూ గోదావరి నదిపై ఉన్న హేవలాక్ బ్రిడ్జిని విద్యుద్దీపాలంకరణ తో దేదీప్యమానంగా తయారు చేస్తామని, బ్రిడ్జిపై లేజర్ షో, బాణసంచా కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. కడియం నర్సరీలతో రాజమండ్రిలో మెగా ఫ్లవర్ షో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ప్రధాన మీడియా సెంటర్, ఆనం కళా కేంద్రంలో సెంట్రల్ మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కొవ్వూరు గోపాద  క్షేత్రం సమీపంలోని జూనియర్ కళాశాలలో, నర సాపురంలో కూడా మీడియా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

 తొలి స్నానమాచరించనున్న భార తీతీర్థ స్వామి

 పుష్కరాల 12 రోజులూ నిర్విరామంగా వెలిగేలా అఖండ జ్యోతిని ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లా నుంచి 500 మంది చొప్పున 13 జిల్లాల నుంచి 6,500 మందితో శోభాయూత్ర ద్వారకా తిరుమల నుంచి కాలినడకన జూలై  11న ప్రారంభమై 13న సాయంత్రం  రాజమండ్రి చేరుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లో పుష్కర స్వాగత జ్యోతులను ఏర్పాటు చేస్తామని, అవి ఆ జిల్లాల్లో గ్రామాలు, మండల కేంద్రాల మీదుగా జూలై 14న రాజమండ్రి  చేరుకుంటాయని చెప్పారు. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి మొదట పుష్కర స్నానమాచరిస్తారన్నారు.

 

 పుష్కరాల 12 రోజులూ గోదావరికి నిత్యహారతి ఇస్తామన్నారు. పుష్కరాలు, పర్యావరణంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పుష్కర యాత్రికులకు అత్యవసర వైద్య సదుపాయూలు అందించేందుకు విశాఖపట్నం నుంచి ప్రత్యేక అధికారి నాయక్‌ను నియమించామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి 500 మంది వలంటీర్లు, ఐఎంఏ నుంచి 13 జిల్లాల ప్రతినిధులు పుష్కర మహాపర్వంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, పుష్కరాల ప్రత్యేకాధికారి ధనంజయరెడ్డి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top