3 కిలోల బంగారం బ్యాగు మాయం | 3 kilos gold bag missing in kaveri travels bus | Sakshi
Sakshi News home page

3 కిలోల బంగారం బ్యాగు మాయం

Apr 22 2015 6:54 PM | Updated on Sep 3 2017 12:41 AM

3 కిలోల బంగారం బ్యాగు మాయం

3 కిలోల బంగారం బ్యాగు మాయం

బస్సులో ప్రయాణిస్తుండగా మూడు కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఇద్దరు వ్యాపారులు బుధవారం ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశారు.

సాక్షి, హైదరాబాద్: బస్సులో ప్రయాణిస్తుండగా మూడు కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఇద్దరు వ్యాపారులు బుధవారం ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ రఫిక్ మహ్మద్, ఎస్.కె.మహ్మద్‌పాషాలు అక్షయ తృతీయ సందర్భంగా శనివారం రాత్రి కావేరి ట్రావెల్స్ బస్సులో మూడు కేజీల బంగారు ఆభరణాలు బ్యాగులో పెట్టుకుని నగరానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌బీనగర్ రింగురోడ్డు సమీపంలోకి రాగానే వీరి వెనుక సీటులో కూర్చున్న కొంతమంది ఒక్కసారిగా దిగి వెళ్లిపోయారు.

బస్సు దిల్‌సుఖ్‌నగర్ సమీపానికి చేరేసరికి ఈ విషయం గమనించిన వ్యాపారులు బస్సు ఆపి పరిశీలించారు. బ్యాగు దొరక్కపోవడంతో అదే రోజు నెల్లూరులో కావేరి ట్రావెల్స్ వద్దకు వెళ్లి వారి వెనుక సీటులో కూర్చున్న వారి వివరాలు సేకరించగా బుక్ చేసిన వారి ఫోన్ నెంబర్‌లు స్విచ్చాఫ్ రావడంతో వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం నగరానికి వచ్చిన వారు ఎల్‌బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement