వైఎస్సార్‌ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు | 200 families joins YSRCP in Nandyal | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు

Aug 9 2017 1:25 PM | Updated on May 29 2018 4:40 PM

వైఎస్సార్‌ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు - Sakshi

వైఎస్సార్‌ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది.

నంద్యాల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.  కర్నూలు జిల్లా పొన్నాపురానికి చెందిన 200 కుటుంబాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరాయి.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శిల్పా కుటుంబం ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదని, చేయదని అన్నారు. చంద్రబాబు కుట్రలు నంద్యాలలో సాగవని పేర్కొన్నారు. నంద్యాల ప్రజలు కుయుక్తులు, ప్రలోభాలకు లొంగరని స్పష్టం చేశారు.

తమ పార్టీకి రోజు రోజుకు బలం పెరుగుతుండటం పట్ల వైఎస్సార్‌ సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేటి నుంచి నంద్యాలలో పర్యటిస్తుండటంతో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement