వృద్ధురాలిపై దాడి... బంగారం దోపిడీ | 20 grams gold robbery in kadapa distirict | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై దాడి... బంగారం దోపిడీ

Mar 13 2015 2:00 PM | Updated on Sep 2 2017 10:47 PM

బీరువాలు తయారు చేసే వ్యక్తిలా ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడి చేసి రెండు బంగారు చైన్లను లాక్కుని పరారయ్యాడు.

ప్రొద్దుటూరు : బీరువాలు తయారు చేసే వ్యక్తిలా ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడి చేసి రెండు బంగారు చైన్లను లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికంగా వసంతగడ్డలో సరోజమ్మ(75) ఇంటికి శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. తాను బీరువాలు తయారు చేస్తానని, రిపేర్ ఉందా అంటూ సరోజమ్మను ప్రశ్నించాడు.

అవసరం లేదని చెప్పేలోపలే దుండగుడు ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యాడు. గాయపడ్డ సరోజమ్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement