రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | 2 smugglers arrested in chittoor distirict | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Mar 23 2015 11:13 AM | Updated on Aug 20 2018 4:27 PM

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని నాగయ్యగారి పల్లి వద్ద సోమవారం అటివీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్ కు తరిలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement