పాదచారులపైకి దూసుకెళ్లిన స్కార్పియో | 2 pedestrian injured in accident in vishaka | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన స్కార్పియో

Jul 24 2015 10:17 AM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.

విశాఖపట్టణం(హుకుంపేట): విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని హుకుంపేటలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. హుకుంపేట మండలం కొట్నపల్లి సమీపంలోని పాడేరు- అరకు మార్గంలో రోడ్డు లో రాజమండ్రి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement