అతి వేగం ప్రాణాల మీదకు తెచ్చింది | 2 injured in a road accident | Sakshi
Sakshi News home page

అతి వేగం ప్రాణాల మీదకు తెచ్చింది

Jul 26 2015 6:51 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారును నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ప్రకాశం (దర్శి): ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారును నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన షేక్ మస్తాన్ బాబు, కారును అతివేగంగా నడిపి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. దీంతో మస్తాన్ బాబుతో పాటు, కారులో ఉన్న సుభానీ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement