గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి | 2 dies in Ganesh Idol Immersion in krishna | Sakshi
Sakshi News home page

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి

Sep 21 2015 6:11 AM | Updated on Aug 3 2018 2:57 PM

గుడివాడలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది.

కృష్ణా: కృష్ణాజిల్లాలో వినాయక విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి జరిగింది. ఆదివారం గుడివాడ పట్టణం దొండపాడు రోడ్డులోని పెద్దకాల్వ వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు కాలుజారి కాల్వలో పడిపోయారు. వీరిని స్థానిక వీకేఆర్ అండ్ వీఎన్‌బీ పాలిటెక్నిక్ విద్యార్థులుగా గుర్తించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు కాల్వ వద్దకు చేరుకున్న తర్వాత నిమజ్జనం చేస్తుండగా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. వీరిలో ముగ్గురిని స్థానికులు బయటకు తీయగా ఇద్దరు గల్లంతయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో సిహెచ్.మణికంఠ (18) మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement