Hyderabad: ఖైరతాబాద్‌ గణేశుడి రూట్‌ మ్యాప్‌ | Hyderabad Gears Up For Ganesh Immersion On Saturday, Check Out Balapur And Khairatabad Nimajjanam Route Map | Sakshi
Sakshi News home page

Hyderabad: ఖైరతాబాద్‌ గణేశుడి రూట్‌ మ్యాప్‌

Sep 4 2025 9:36 AM | Updated on Sep 4 2025 10:27 AM

Hyderabad gears up for Ganesh immersion on Saturday

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే నిమజ్జనం ఏర్పాట్లలో నగర అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శోభాయాత్ర రూట్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్‌ బాబు, అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డెవిస్, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరిలతో కలిసి బాలాపూర్‌ వినాయకుడి శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌ వరకు జరిగే శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలాపూర్, చార్మినార్‌ సర్కిల్, మొజం జాహి మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ రూట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు, ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.  

బందోబస్తులో 30 వేలమంది పోలీసులు 
నగరంలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా 30 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సీవీ ఆనంద్‌ చెప్పారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్‌ యాక్షన్‌ టీంలను సిద్ధం చేశామన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్‌ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ ఈ నెల 2 వ తేదీ వరకూ నగరవ్యాప్తంగా 1,21,905 గణేశ్‌ ప్రతిమల నిమజ్జనం జరిగిందన్నారు. ఈ నెల 6వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నామని తెలిపారు.  

బాలాపూర్‌ గణేశ్‌ రూట్‌ మ్యాప్‌  
కట్ట మైసమ్మ దేవాలయం– కేశవగిరి– చంద్రాయణగుట్ట ఎక్స్‌ రోడ్‌– మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్‌– ఇంజన్‌ బౌలి– అలియాబాద్‌– నాగుల్‌ చింత జంక్షన్‌ – హిమ్మత్‌పురా– చార్మినార్‌– మదీనా క్రాస్‌రోడ్‌– అఫ్జల్‌ గంజ్‌– ఎంజే మార్కెట్‌– అబిడ్స్‌ జీపీఓ– బీజేఆర్‌ విగ్రహం– బషీర్‌బాగ్‌ క్రాస్‌రోడ్‌– లిబర్టీ– అంబేడ్కర్‌ విగ్రహం– ట్యాంక్‌ బండ్‌ 

ఖైరతాబాద్‌ గణేశుడి రూట్‌ మ్యాప్‌  
బడా గణేశ్‌– పాత సైఫాబాద్‌ పీఎస్‌– ఇక్బాల్‌ మినార్‌– తెలుగుతల్లి విగ్రహం– అంబేద్కర్‌ విగ్రహం– ట్యాంక్‌ బండ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement