
కొనసాగుతున్న తొలగింపు పనులు
గతేడాదికన్నా తగ్గిన వ్యర్థాలు
బంజారాహిల్స్: వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్‌ఫాత్‌ల నుంచి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సిబ్బంది వెయ్యి టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. ఈ నెల 6వ తేదీ విగ్రహాల నిమజ్జనం నుంచే హుస్సేన్‌సాగర్‌లో నుంచి, రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి వ్యర్థాల తొలగింపు పనులను జీహెచ్‌ఎంసీ సర్కిల్–17 సిబ్బంది ముమ్మరం చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కారి్మకులు ఈ చెత్త తొలగింపులో పాల్పంచుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 850 టన్నుల వ్యర్థాలు తొలగించగా ఈ ఏడాది వెయ్యి టన్నులకు చేరింది.
సుమారుగా అయిదున్నర లక్షల మంది భక్తులు ఈ సారి నిమజ్జన వేడుకలను తిలకించడానికి వచ్చారు. 40 వేల పెద్ద వినాయక విగ్రహాలు ఈ సారి నిమజ్జనం చేయగా గతేడాది కంటే 5 వేల విగ్రహాలు అదనంగా పెరిగాయి. నిమజ్జనానికి తిలకించడానికి వచి్చన భక్తుల ద్వారా టన్నుల కొద్ది పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాస్‌లు, ప్లాస్టిక్ సంచులు, విగ్రహాల అలంకరణ, పూజా సామగ్రి పెద్ద సంఖ్యలో పేరుకుపోవడమే కాకుండా వీటి తొలగింపు కూడా సిబ్బందికి సవాల్‌గా మారింది. విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ఈ సారి చెత్తా చెదారం తొలగింపు కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పండుగ తర్వాత మూడో రోజు నుంచి మొదలైన చెత్తాచెదారం తొలగింపు నిమజ్జనం అనంతరం వారం రోజుల వరకు కొనసాగింది.
దీంతో హుస్సేన్‌సాగర్ చుట్టూ శుక్రవారం నుంచి పూర్తి క్లీన్ అండ్ గ్రీన్ చోటు చేసుకుంది. ఓ వైపు జీహెచ్‌ఎంసీ ప్రణాళికాబద్ధంగా షిఫ్ట్‌ల వారీగా సిబ్బందిని నియమించి వ్యర్థాల తొలగింపు చేపట్టగా హెచ్‌ఎండీఏ కూడా హుస్సేన్‌సాగర్‌లో నుంచి 11 టన్నుల వేస్ట్‌ను తొలగించింది. ఇంకా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది 12 వేల టనుల నిమజ్జన వ్యర్థాలు తొలగించగా ఈ సారి కొంత మేర తగ్గుముఖం పట్టింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఐరన్ మెటీరియల్ కూడా పెద్ద మొత్తంలో ఈ సారి తొలగించి హుస్సేన్‌సాగర్‌ను క్లీన్ చేశారు.
హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఎవరికి వారే వ్యర్థాలు, ఇనుప చువ్వలు, ఇతరత్రా వేస్ట్ మెటీరియల్‌ను తొలగించి ఇప్పుడిప్పుడే ప్రాంతాన్ని కుదుటపడేలా చేశారు. మొత్తానికి గతేడాదితో పోలిస్తే ఈ సారి నిమజ్జన వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగవడమే కాకుండా వాటిని తొలగించడంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ద్య కారి్మకులు అదనంగా మూడు రోజుల కష్టపడాల్సి వచ్చింది. తొలగించిన వ్యర్థాలను డంపింగ్ యార్డ్‌కు తరలించినా కూడా జీహెచ్‌ఎంసీకి ఒక సవాల్‌గా మారింది. మొత్తానికి పది రోజులుగా దృష్టి పెట్టిన సిబ్బంది ఇప్పుడిప్పుడే సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు.