క్రూజర్, లారీ ఢీ: ఇద్దరి మృతి | 2 died in a road accident in nellore district | Sakshi
Sakshi News home page

క్రూజర్, లారీ ఢీ: ఇద్దరి మృతి

Jan 12 2016 7:53 AM | Updated on Aug 30 2018 3:58 PM

నెల్లూరు పట్టణం సమీపంలోని కనపర్తిపాడు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

నెల్లూరు రూరల్: నెల్లూరు పట్టణం సమీపంలోని కనపర్తిపాడు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కందుకూరు నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది క్రూజర్ వ్యానులో తిరుపతికి వెళుతున్నారు. కనపర్తిపాడు జంక్షన్ వద్దకు చేరుకున్నాక ఎదురుగా వస్తున్న లారీని టెంపో ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఎస్‌కే బాబుల్ (60), ఆయన మనవడు జాన్‌బాషా (22) తీవ్ర గాయాలతో ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని సింహపురి ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement