రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | 2 died in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Jun 26 2015 7:48 AM | Updated on Aug 25 2018 6:06 PM

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది.

ముదినేపల్లి (కృష్ణా): రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న లారీ బైక్ పై నుంచి వెళ్లడంతో వాహనం పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు క్రాస్‌రోడ్డు సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గుడివాడ నుంచి ముదినేపల్లి వైపు వెళ్తున్న ద్విచ క్రవాహనం కోడూరు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.

దీంతో ఆ వ్యక్తి కాలు విరగడంతో పాటు.. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అదుపుతప్పి రోడ్డు పై పడ్డారు. అదే సమయంలో గుడివాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద కిందపడి ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి.. కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement