గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం | 2 dead bodys found in godavari in west godavari district | Sakshi
Sakshi News home page

గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

Jan 4 2016 12:19 PM | Updated on Sep 3 2017 3:05 PM

ఆదివారం సాయంత్రం గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

కొవ్వూరు: ఆదివారం సాయంత్రం గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన నందిగాం జయదేవ్(15), సూర్యసుమంత్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. కొవ్వూరు గోశ్పాద క్షేత్రం వద్ద స్నాన ఘట్టంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement